ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచిన వాడిమాటే నమ్ముతుంది .. 'గని' ట్రైలర్ రిలీజ్!

17-03-2022 Thu 11:30
  • 'గని'గా వరుణ్ తేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు 
  • ఏప్రిల్ 8వ తేదీన విడుదల  
Ghani Trailer Released
వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ ఆయన బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "గని .. ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్' అంటూ హీరోని తల్లి కోరడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ వెంటనే 'గని'ని బాక్సింగ్ రింగ్ లో చూపించారు. తన కొడుకు తన మాట విన్నాడని ఆ తల్లి పొంగిపోతూ ఉంటుంది. 'ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే, అది తాను నేషనల్ ఛాంపియన్ విజేతగా నిలిచే రోజే కావాలి' అని గని అనుకుంటూ ఉంటాడు. 

ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది' అనే డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్  అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. నదియా .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీంచంద్ర కనిపించనున్నారు.