Mahesh Babu: 'సర్కారువారి పాట' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారు!

Sarkaru Vaari Paata movie update
  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఈ నెల 20వ తేదీన సెకండ్ సింగిల్ 
  • మే 12వ తేదీన సినిమా రిలీజ్  

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో పూర్తి వినోదభరితమైన చిత్రంగా 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నారు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. 
 
తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'కళావతి' పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. రికార్డుస్థాయి వ్యూస్ ను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ పోస్టర్ వదిలారు. 

ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. యాక్షన్ సీన్స్ .. సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్టును .. ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్టును మహేశ్ బాబు పట్టాలెక్కించనున్నాడు.

  • Loading...

More Telugu News