Wasim Jaffer: కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అవుతాడు: వసీం జాఫర్

Rohit Sharma will become better captain than Virat Kohli says Wasim Jaffer
  • రోహిత్ కెప్టెన్సీలో అన్ని సిరీస్ లను వైట్ వాష్ చేస్తున్నారు
  • కెప్టెన్సీ బాధ్యతలు సరైన వ్యక్తి చేతుల్లోకి వచ్చాయనిపిస్తోంది
  • రోహిత్ గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎదగడం ఖాయమన్న జాఫర్ 
టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను పూర్తి స్థాయిలో స్వీకరించిన రోహిత్ శర్మ వరుస విజయాలతో దుసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లీ కంటే రోహిత్ మెరుగైన కెప్టెన్ గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ఎన్ని టెస్టులకు రోహిత్ కెప్టెన్ గా ఉంటాడో చెప్పలేకపోయినా... రోహిత్ గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని అన్నాడు. 

రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా అన్ని సరీస్ లను వరుసగా వైట్ వాష్ చేస్తోందని జాఫర్ చెప్పాడు. ఈ ఫలితాలను చూస్తుంటే జట్టు నాయకత్వ బాధ్యతలు సరైన వ్యక్తి చేతుల్లోకి వచ్చాయనిపిస్తోందని అన్నాడు. ఇండియా గడ్డపై ఇటీవల అన్ని ఫార్మాట్లలో జరిగిన మ్యాచ్ లలో భారత జట్టు వరుసగా 14 మ్యాచ్ లను గెలుపొందింది. వీటిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను కూడా భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
Wasim Jaffer
Rohit Sharma
Virat Kohli
Team India
Captain

More Telugu News