Ramcharan: సముద్రఖని దర్శకత్వంలో రామ్ చరణ్?

Cgaran in Samudrakhani movie
  • 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో చరణ్ 
  • తన 15వ సినిమాకి దర్శకుడిగా శంకర్
  • లైన్లోనే ఉన్న గౌతమ్ తిన్ననూరి 
  • సముద్రఖని కథ పట్ల ఆసక్తి 

చరణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చరణ్, ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే చరణ్ కి సముద్రఖని ఒక మంచి కథను వినిపించినట్టుగా తెలుస్తోంది. సముద్రఖని మంచి రచయిత .. నటుడు .. దర్శకుడు అనే సంగతి తెలిసిందే. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన 'వినోదయా సితం' తెలుగు రీమేక్ లో చేయడానికి ఆయన పవన్ కల్యాణ్ ను ఒప్పించిన సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు సముద్రఖని మరో కథను చరణ్ కి వినిపించాడట. ఆయన వినిపించిన ఆ కథ కొత్తగా ఉండటంతో, చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. ప్రస్తుతం సముద్రఖని పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News