North Korea: ఉత్తర కొరియా దూకుడుకు ఎదురుదెబ్బ.. గాల్లోనే పేలిపోయిన క్షిపణి

  • భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయిన క్షిపణి
  • ప్రయోగించిన క్షణాల్లోనే ఘటన
  • ప్రయోగంపై మౌనం వహించిన ఉత్తర కొరియా
North Korea Silent After Missile Explodes Over Pyongyang

వరుస క్షిపణి ప్రయోగాలతో ఇటీవల దూకుడు పెంచిన ఉత్తర కొరియాకు ఎదురుదెబ్బ తగిలింది. అది చేపట్టిన క్షిపణి ప్రయోగం విఫలమైంది. భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. ఈ క్షిపణికి సంబంధించిన వివరాలేవీ వెల్లడి కాలేదు. ఉత్తర కొరియా కూడా దీనిపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అధికారిక మీడియా కూడా ఈ ప్రయోగంపై మౌనం వహించింది. ఉత్తర కొరియా ఈ ఏడాది చేపట్టిన పదో ప్రయోగం ఇది. 

దాదాపు మూడు మిలియన్ల మంది నివసించే సునాన్‌ ప్రాంతం నుంచి నిన్న తెల్లవారుజామున బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ క్షిపణి రాజధాని ప్యోంగ్యాంగ్‌పైన పేలిపోయింది. ఆ సమయంలో నగరంపైన ఆకాశంలో ఎర్రటి రంగులతో కూడిన పొగలు, మెరుస్తున్న శకలాలు కిందపడడం కనిపించినట్టు ఎన్‌కే న్యూస్ తెలిపింది.

More Telugu News