Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ కు షాకిచ్చిన కేరళ థియేటర్ల యాజమాన్యాలు

Kerala theatre owners boycotts Dulquer Salmaan films
  •  'సెల్యూట్'ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్న దుల్కర్ 
  • దుల్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న థియేటర్ యాజమాన్యాలు
  • ఆయన సినిమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మలయాళం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్ కు కేరళ థియేటర్ల ఓనర్లు షాకిచ్చారు. ఆయన నటించిన చిత్రాలన్నింటినీ బాయ్ కాట్ చేయాలని ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయించింది. 

దీనికి కారణం ఏమిటంటే... తన తాజా చిత్రం 'సెల్యూట్'ను నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన సినీలివ్ లో విడుదల చేయాలని దుల్కర్ నిర్ణయం తీసుకున్నాడు. థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని నిర్ణయించడంతో ఆయన సినిమాలన్నింటినీ బాయ్ కాట్ చేయాలని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. థియేటర్ ఓనర్లు తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ సల్మాన్ ఇంతవరకు స్పందించలేదు.
Dulquer Salmaan
Films
Boycott
Kerala
Theatre Owners

More Telugu News