Russia: జెలెన్‌స్కీ ప్రసంగానికి అమెరికా ఉభయసభల్లో స్టాండింగ్ ఒవేషన్!

  • జెలెన్‌స్కీ ప్ర‌సంగాల‌కు పాశ్చాత్య దేశాల హ‌ర్షం
  • అమెరికా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి జెలెన్ స్కీ ప్ర‌సంగం
  • స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చిన అమెరికా చ‌ట్ట స‌భ‌ల స‌భ్యులు
zelenskyy got standing ovation from america

ర‌ష్యా సాగిస్తున్న దండ‌యాత్ర‌ను ఎదురొడ్డి మ‌రీ ధైర్యంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్ర‌పంచ దేశాల‌కు హీరోగా మారిపోయారు. అటు నాటో, ఇటు ఈయూ దేశాలు జెలెన్ స్కీ ప్ర‌సంగానికి స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చేశాయి. తాజాగా అమెరికా పార్ల‌మెంటు కూడా జెలెన్ స్కీ ప్ర‌సంగానికి స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చింది.  

బుధ‌వారం నాడు అమెరికా ఉభ‌య స‌భ‌లు స‌మావేశం కాగా.. ఆ స‌మావేశాన్ని ఉద్దేశించి జెలెన్‌స్కీ ప్ర‌సంగించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఉక్రెయిన్ నుంచే జెలెన్ స్కీ ప్ర‌సంగించ‌గా.. అమెరికా ఉభ‌య స‌భ‌ల స‌భ్యులు మొత్తం లేచి నిల‌బ‌డి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.

అమెరికాపై గ‌తంలో జ‌రిగిన కీల‌క దాడుల‌ను ప్ర‌స్తావించిన జెలెన్ స్కీ.. ఇప్పుడు తాము ప్ర‌తి నిత్యం అలాంటి దాడుల‌నే ఎదుర్కొంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా కూడా ర‌ష్యాకు త‌లొగ్గేది లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌సంగం విన్నంత‌నే అమెరికా పార్ల‌మెంటు స‌భ్యులు లేచి నిల‌బ‌డి జెలెన్‌స్కీకి స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.

More Telugu News