CPI Narayana: వైసీపీతో సహజీవనం చేస్తున్న బీజేపీ మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుందో!: సీపీఐ నారాయణ

I welcome Pawan Kalyan comments says CPI Narayana
  • వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనన్న పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా
  • వైసీపీ, బీజేపీ సహజీవనం చేస్తున్నాయి
  • కమ్యూనిస్టుల బలం చాలా తగ్గిపోయిందన్న నారాయణ 

వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ... పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతానన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వదని... బీజేపీ, వైసీపీలు సహజీవనం చేస్తున్నాయని అన్నారు. వైసీపీతో సహజీవనం చేస్తున్న బీజేపీ మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. 

బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నోరెత్తకపోవడం బాధాకరమని నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ, ఏపీకొచ్చి శివతాండవం చేస్తారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం చాలా తగ్గిపోయిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చేవని... ఇప్పుడు బలం తగ్గడం వల్ల ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News