India: భారత్ పైకి మిస్సైల్ ప్రయోగించేందుకు పాకిస్థాన్ సిద్ధమయిందట..!

  • ఇటీవల పొరపాటున పాక్ భూభాగంపై పడిన భారత్ మిస్సైల్
  • ప్రతీకార చర్యకు దిగాలనుకున్న పాకిస్థాన్
  • సంచలన కథనాన్ని ప్రచురించిన బ్లూమ్ బర్గ్
Pakistan wanted to fire missile onto India

భారత్ కు చెందిన మిస్సైల్ ఇటీవల పొరపాటుగా దూసుకెళ్లి పాకిస్థాన్ భూభాగంపై పడిన సంగతి తెలిసిందే. సాంకేతిక వైఫల్యం కారణంగా ఈ పొరపాటు జరిగిందని భారత రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అమెరికా సైతం ఇది పొరపాటుగా జరిగిన ఘటన అని పేర్కొంది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది. అంతేకాదు ప్రతీకార చర్యగా భారత్ పైకి మిస్సైల్ ప్రయోగించేందుకు పాకిస్థాన్ సిద్ధమయిందట. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. 

క్షిపణి ప్రయోగం కోసం ప్రణాళికలను కూడా పాకిస్థాన్ రూపొందించిందట. అయితే, ఒకవేళ క్షిపణిని ప్రయోగిస్తే జరగబోయే పరిణామాలపై ఓ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత... మిస్సైల్ ప్రయోగ నిర్ణయంపై వెనక్కి తగ్గిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే ఈ వార్తపై అటు పాకిస్థాన్ కానీ, ఇటు ఇండియా కానీ స్పందించలేదు.

More Telugu News