Kashmir Files: బాక్సాఫీసు వసూళ్లలో కశ్మీర్ ఫైల్స్ సరికొత్త రికార్డు.. ఉత్తరాఖండ్ లో పన్ను మినహాయింపు

The Kashmir Files box office collection records largest Tuesday haul of 18 crores
  • ఐదో రోజు రూ.18 కోట్ల వసూళ్లు
  • మొదటి నాలుగు రోజుల కంటే అధికం
  • మొత్తం రూ.60 కోట్లు దాటిన వసూళ్లు
  • రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ

వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కశ్మీర్ ఫైల్స్’కు ఉత్తరాఖండ్ సర్కారు మద్దతు పలికింది. ఈ సినిమాను చూసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పన్ను నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. 

1990లలో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత అంశంతో తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ సినిమాను ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలంటూ బీజేపీ ఎంపీలకు ఆయన సూచించడం తెలిసిందే. 

మరోవైపు సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐదో రోజు మరింత పెద్ద మొత్తంలో వసూళ్లను సాధించింది. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు రూ.3.55 కోట్లు, శనివారం రూ.8.50 కోట్లు, ఆదివారం రూ.15.10 కోట్లు, సోమవారం రూ.15.05 కోట్ల చొప్పున రాబట్టుకుంది. ఇక తొలి నాలుగు రోజుల స్థాయిని దాటేసి మంగళవారం ఐదో రోజు రూ.18 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటిపోయాయి.

  • Loading...

More Telugu News