Ajith: మరోసారి అజిత్ సరసన నయనతార!

Nayanatara in Ajith Movie
  • తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ 
  • వరుస సినిమాలతో బిజీగా నయన్ 
  • ఇద్దరి కాంబినేషన్లో విఘ్నేశ్ శివన్ మూవీ 
  • నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్    

కోలీవుడ్ హీరోలు అంతా కూడా ఎవరి బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలను వారు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక అజిత్ విషయానికి వస్తే సినిమా గురించి తప్ప ఆయన మరి దేని గురించి ఆలోచన చేయడు. టేకింగ్ నచ్చితే దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తూ వెళుతుంటాడు. అలా ఇప్పుడు ఆయన హెచ్. వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా అజిత్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు విఘ్నేశ్ శివన్. అందరూ ఊహించినట్టుగా ఈ సినిమాలో కథానాయిక నయనతారనే. అయితే ఈ సినిమా వీరి బ్యానర్లో కాదు .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

గతంలో అజిత్ - నయన్ కాంబినేషన్లో భారీ సినిమాలు వచ్చాయి. 'విశ్వాసం' వారి కాంబినేషన్లో వచ్చిన పెద్ద హిట్ అని చెప్పుకోవాలి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటను మరోసారి తెరపై చూడాలనుకునేవారి ముచ్చట త్వరలో తీరనుందన్న మాట.

  • Loading...

More Telugu News