Balakrishna: బాలకృష్ణను ఢీకొనే ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా విలన్ లుక్!

  • షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా 
  • బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్  
  • ప్రతినాయకుడిగా దునియా విజయ్
Duniya Vijay first look released

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. ఈ సినిమాకి 'వీరసింహా రెడ్డి' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది.

ఈ సినిమాలో విలన్ ఊరమాస్ లుక్ తో ఉంటాడు. ఎదుటివారు ఎవరైనా ఎంతమాత్రం లెక్కచేయని ఈ పవర్ఫుల్ విలన్ పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. ఆ పాత్రను .. ఆ పాత్రలో ఆయన లుక్ ను పరిచయం చేస్తూ కొంతసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించుకుంటూ దునియా విజయ్ వదిలిన లుక్ చాలు, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News