Amazon: అమెజాన్‌, ఫ్యూచ‌ర్ చ‌ర్చ‌లు విఫలం!.. సుప్రీం చేరిన పంచాయితీ!

  • ఫ్యూచ‌ర్‌, రిల‌య‌న్స్‌ల ఒప్పందంపై అమెజాన్ సీరియ‌స్‌
  • నెల‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న వివాదం
  • కోర్టు బ‌య‌టే ప‌రిష్క‌రించుకుంటామ‌న్న ఇరు సంస్థ‌లు
  • తాజాగా చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లు సుప్రీంకు వెల్ల‌డి
Amazon and Future group talks have failed

అమెజాన్‌, ఫ్యూచ‌ర్ గ్రూపుల మ‌ధ్య నెల‌కొన్న వివాదం ఇప్పుడ‌ప్పుడే తెగేలా క‌నిపించ‌డం లేదు. ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య నెల‌కొన్న వాణిజ్య వివాదం ఇప్ప‌టికే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు చేర‌గా.. తాము కోర్టు బ‌య‌టే చ‌ర్చించుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటామ‌ని రెండు సంస్థ‌లు చెప్ప‌డంతో సుప్రీంకోర్టు కూడా స‌రేన‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు ద‌ఫాలుగా ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య సుధీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే ఎలాంటి ఫ‌లితం రాలేదు. 

వెర‌సి ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు ఓ కొలి‌క్కి రాలేద‌ని, చ‌ర్చ‌లు పూర్తిగా విఫ‌లం అయ్యాయ‌ని అమెజాన్ త‌ర‌ఫు న్యాయ‌వాది సుప్రీంకోర్టుకు మంగ‌ళ‌వారం తెలిపారు. ఫ‌లితంగా సుప్రీంకోర్టు మ‌రోమారు ఈ వివాదంపై దృష్టి సారించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఫ్యూచ‌ర్ గ్రూప్‌, రిల‌య‌న్స్‌ల మ‌ధ్య కుదిరిన ఓ ఒప్పందం త‌న ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తోందంటూ అమెజాన్ కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News