Andhra Pradesh: ఆ సత్తా ఒక్క వైసీపీకి మాత్రమే ఉంది: కొడాలి నాని

  • 160 సీట్ల‌లో పోటీ చేసే స‌త్తా కూడా ఏ పార్టీకి లేదు
  • 175 సీట్ల‌ను అన్ని విప‌క్షాలు పంచుకుని పోటీ చేయాల్సిందే
  • అన్ని సీట్ల‌లో పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకే ఉంది
  • మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
kodali nani viral comments on opposirion parties

ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీలోని విప‌క్షాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌లో సొంత అభ్య‌ర్థుల‌తో పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మిన‌హా మ‌రే ఇత‌ర పార్టీకి లేద‌ని ఆయ‌న అన్నారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్ల‌కు కూడా సొంతంగా పోటీ చేసే స‌త్తా ఏ పార్టీకి కూడా లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వ‌రుస మ‌ర‌ణాల గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన నాని.. జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై విప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. బాధిత గ్రామ ప్ర‌జ‌ల‌ను విప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని, సాధార‌ణ మ‌ర‌ణాల‌ను మ‌ద్యం మ‌ర‌ణాలుగా చిత్రీక‌రిస్తున్నాయ‌ని ఆరోపించారు. సీఎం జ‌గ‌న్‌పై బుర‌ద‌చ‌ల్లాల‌ని 420 బ్యాచ్ య‌త్నిస్తోందని ఆరోపించిన ఆయ‌న‌.. ప్ర‌భుత్వాన్ని అల్ల‌రి చేయాల‌ని చూస్తే.. చంద్ర‌బాబు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు.

ఆ త‌ర్వాత 2024లో జ‌రిగే ఎన్నిక‌ల గురించి కూడా నాని మాట్లాడారు. "రాష్ట్రంలో ఒకేసారి 160 సీట్ల‌కు పోటీ చేసే స‌త్తా ఏ ప్ర‌తిప‌క్ష‌ పార్టీకి లేదు. గుంపులుగా పందుల త‌ర‌హాలో అంతా క‌లిసి 175 సీట్లు పంచుకోవాల్సిందే. 175 సీట్ల‌లో ఒకేసారి పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మాత్ర‌మే ఉంది" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News