Naga babu: జంగారెడ్డిగూడెంలో నాగ‌బాబు.. మృతుల కుటుంబాల‌కు స‌హాయం

nagababu visits jangareddygudem
  • నాదెండ్ల‌తో క‌లిసి జంగారెడ్డిగూడెంలో ప‌ర్య‌ట‌న‌
  • మృతుల కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున సాయం
  • పార్టీ ఆవిర్భావ వేడుక‌ల మ‌రునాడే ప‌ర్య‌ట‌న‌
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య కొన్ని రోజులుగా మాట‌ల యుద్ధానికి కార‌ణ‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం మ‌రణాల‌పై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన కూడా స్పందించింది. ఇప్ప‌టికే ఈ మ‌ర‌ణాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌స్తావించ‌గా.. ఆ మ‌రునాడే మంగ‌ళ‌వారం పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు జంగారెడ్డిగూడెంలో ప‌ర్య‌టించారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాటు సారా కార‌ణంగా చనిపోయార‌ని భావిస్తున్న బాధితుల కుటుంబాల‌ను నాదెండ్ల‌, నాగ‌బాబు ప‌రామ‌ర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
Naga babu
Janasena
Nadendla Manohar
Jangareddygudem

More Telugu News