Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో టీడీపీ తీరుపై జ‌గ‌న్ ఆగ్ర‌హం.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన‌ స్పీకర్‌

ruckus in ap assembly
  • జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలన్న‌ టీడీపీ సభ్యులు
  • అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ 
  • వైట్‌,రెడ్‌, గ్రీన్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం
  • టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్న‌ జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో నేడు కూడా గంద‌ర‌గోళం చెల‌రేగింది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో అసెంబ్లీ స‌మావేశాలు స‌జావుగా జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. 

ఇక సస్పెన్షన్ కు గురైన వారిలో అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, సత్యప్రసాద్ ఉన్నారు. అనంత‌రం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ ప్రవేశపెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

వైట్‌, రెడ్‌, గ్రీన్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించడంతో అందుకు సభ ఆమోదం తెలిపింది. ఆ గీత‌లు దాటితే ఆటోమేటిక్‌గా సభ్యులు సస్పెండ్ అవుతారని చెప్పారు. కాగా, స‌భ‌లో టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జ‌గ‌న్ మండిప‌డ్డారు. టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని జగన్ అన్నారు. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు చేస్తోన్న ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని చెప్పారు. 

అస‌లు 55 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఎవరైనా సారా కాస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యం కాద‌ని చెప్పారు. మరోపక్క, టీడీపీ సభ్యుల తీరును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా త‌ప్పుబ‌ట్టారు. టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతూ స‌భ జ‌ర‌గ‌కుండా గందరగోళం సృష్టిస్తున్నారని మండిప‌డ్డారు. 

  • Loading...

More Telugu News