Allu Arjun: బాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్ మేకర్ భన్సాలీతో అల్లు అర్జున్ భేటీ.. వీడియో ఇదిగో!

Allu Arjun meets Bollywood filmmaker Sanjay Leela Bhansali
  • 'పుష్ప'తో నార్త్ లో బన్నీకి అమాంతం పెరిగిపోయన క్రేజ్
  • అల్లు అర్జున్ తో భారీ మూవీని ప్లాన్ చేసిన భన్సాలీ
  • దక్షిణాది యోధుడి కథాంశంతో తెరకెక్కనున్న మూవీ
ఇంతకాలం సౌతిండియా టాప్ స్టార్లలో ఒకడిగా వెలుగొందిన అల్లు అర్జున్... 'పుష్ప' సాధించిన అఖండ విజయంతో ఓ రేంజ్ కి వెళ్లిపోయాడు. పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో, బాలీవుడ్ లో సైతం బన్నీ క్రేజ్ ప్రారంభమయింది.

మరోవైపు బాలీవుడ్ లో పాగా వేయడానికి అల్లు అర్జున్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీతో నిన్న అల్లు అర్జున్ భేటీ అయ్యాడు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన బన్నీ... నేరుగా వెళ్లి భన్సాలీని కలవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

బాలీవుడ్ లో భన్సాలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తెరకెక్కించే సినిమాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే ప్రతి హీరో, హీరోయిన్ ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అలాంటి దిగ్గజ దర్శకుడు భన్సాలీతో ఒక ప్రాజెక్ట్ కు అల్లు అర్జున్ ఓకే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

 ఒక దక్షిణాది యోధుడి కథాంశంతో ఓ పీరియాడిక్ మూవీని భన్సాలీ ప్లాన్ చేశారని... ఆ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ, భన్సాలీల కాంబినేషన్లో అదిరిపోయే రేంజ్ లో సినిమా రావడం ఖాయం. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Allu Arjun
Sanjay Leela Bhansali
Tollywood
Bollywood

More Telugu News