Pallavi Raju: టీడీపీలోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు

Pallavi Raju Soon join in TDP
  • టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించిన పల్లవిరాజు
  • పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు పల్లవి స్వయానా చెల్లెలు
  • టీడీపీలో చేరిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్న పల్లవి

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ మేరకు రేపు సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీడీపీలో చేరిన తర్వాత తన తదుపరి కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. 

మంత్రి పుష్ఫ శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవిరాజు స్వయానా చెల్లెలు. గత ఎన్నికల సమయంలోనూ పల్లవిరాజు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News