TS High Court: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణామం
  • తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
  • హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
Telangana high court orders on BJP MLAs suspension

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే, తొలి గంటలోనే బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రసంగానికి పదేపదే అడ్డుపడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్ లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. 

దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, నేడు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సస్పెండైన ఎమ్మెల్యేలు రేపు ఉదయం స్పీకర్ ముందుకు వెళ్లాలని ఆదేశించింది. సస్పెన్షన్ పై స్పీకర్ దే తుది నిర్ణయం అని ధర్మాసనం ఉద్ఘాటించింది. ఈ నేపథ్యంలో, స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అభిప్రాయపడింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకోవచ్చని స్పష్టీకరించింది.

More Telugu News