MS Babu: బావ గారు వచ్చేటి వేళ... అంటూ 'నక్కిలీసు గొలుసు' పాటకు స్టెప్పులేసిన వైసీపీ ఎమ్మెల్యే!

  • డ్యాన్స్ టాలెంట్ చూపించిన పూతలపట్టు ఎమ్మెల్యే బాబు
  • ఓ ప్రైవేటు పార్టీలో చిందులేసిన వైనం
  • హిట్ పాటకు హుషాగారు డ్యాన్స్
  • యూట్యూబ్ లో వీడియో 
YCP MLA dance for a hit single

వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు (చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం) ఓ విందు కార్యక్రమంలో తన డ్యాన్స్ టాలెంట్ చూపించారు. స్నేహితులు, పార్టీ సహచరులతో కలిసి హాయిగా ఎంజాయ్ చేశారు. ఓ ప్రైవేటు పార్టీలో పాల్గొన్న ఎమ్మెస్ బాబు... డీజే బాక్సుల్లో నక్కిలీసు గొలుసు పాట వస్తుండగా హుషారుగా స్టెప్పులేశారు. నక్కిలీసు గొలుసు పాట తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

More Telugu News