TDP: జ‌గ‌న్ మోసం ఖ‌రీదు 25 ప్రాణాలు.. నారా లోకేశ్ వినూత్న నిర‌స‌న‌

  • జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై అట్టుడికిన అసెంబ్లీ
  • ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌
  • నిర‌స‌న‌గా అసెంబ్లీ ముందు టీడీపీ నిర‌స‌న‌
  • ప్ల‌కార్డు చేత‌బ‌ట్టి నిర‌స‌న‌లో పాల్గొన్న లోకేశ్
tdp mlas and mlcs stage protest at ap assembly

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న 18 మ‌ర‌ణాల‌పై ఏపీ అసెంబ్లీ సోమ‌వారం నాడు అట్టుడికిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణాల‌న్నీ నాటు సారా కార‌ణంగానే చోటుచేసుకున్నాయ‌ని విప‌క్ష టీడీపీ ఆరోపించ‌గా.. అందులో వాస్త‌వం లేదంటూ అధికార వైసీపీ బదులిచ్చింది. వెర‌సి ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాద ప్ర‌తివాద‌న‌లు చోటుచేసుకున్నాయి. చివ‌ర‌కు అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ఐదుగురు సీనియ‌ర్ స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌స్పెండ్ చేశారు. ఆ త‌ర్వాత కూడా ర‌చ్చ కొన‌సాగింది. 

అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు నిర‌స‌న‌కు దిగారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ఆందోళ‌న‌లో టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌లు ర‌కాల నినాదాల‌తో కూడిన ప్ల‌కార్డులు ప‌ట్టుకుని క‌నిపించారు. స్వ‌యంగా లోకేశ్ కూడా ఓ ప్ల‌కార్డు ప‌ట్టుకుని నిర‌స‌నను ముందుండి న‌డిపించారు. 

ఈ సందర్భంగా నారా లోకేశ్ చేతిలోని ప్ల‌కార్డు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. జ‌గ‌న్ మోసం ఖ‌రీదు ఈ 25 ప్రాణాలు అంటూ రాసి ఉన్న ప్ల‌కార్డును లోకేశ్ ప‌ట్టుకున్నారు. ఇదే విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియజేసిన లోకేశ్.. నిర‌స‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా జ‌త చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు అన్నీ జ‌గ‌న్‌ హత్యలేనంటూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి అసెంబ్లీ బయట నిరసన తెలిపామ‌ని.. మద్యనిషేదం అన్న జగన్ మాట తప్పి సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయ‌న ఆరోపించారు. సారా మరణాలపై న్యాయవిచారణ జరగాలని.. మృతుల కుటుంబాల‌కు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ సంద‌ర్భంగా లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News