Shashi Tharoor: మోదీ అద్భుతమైన శక్తి.. అయినా బీజేపీ ఏదో ఒక రోజు అవాక్కవ్వాల్సిందే: శశి థరూర్

PM Has Tremendous Vigour Shashi Tharoor Credits Him For UP Polls Win
  • యూపీలో బీజేపీ ఘన విజయం ఆయన ఘనతే
  • రాజకీయంగా మెచ్చుకునేలా పనిచేశారు
  • కానీ, సమాజంలోకి ఆయన కొన్ని శక్తులను వదిలారు
  • మతం, ప్రాంతాల వారీగా విభజించడమే వాటి పని అన్న శశి 
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ప్రధాని మోదీని మెచ్చుకున్నారు. యూపీ విజయం ఘనత ప్రధానిదేనన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన శక్తి, చురుకుదనం కలిగిన వ్యక్తి. ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా రాజకీయంగా ఆకట్టుకునేలా పనిచేశారు’’ అని జైపూర్ సాహిత్య సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

నేడు ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారంటూ.. ఏదో ఒక రోజు వారు బీజేపీయే ఆశ్చర్యపోయేలా షాకిస్తారని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధానిపై విమర్శలను కూడా ఎక్కు పెట్టారు. ‘‘సమాజంలోకి ఆయన కొన్ని శక్తులను ప్రవేశపెట్టారు. మత, ప్రాంతీయ ప్రాతిపదికన జాతిని విభజించడమే వాటి పని. అవి విషాన్ని ఎక్కిస్తుండడం దురదృష్టకరం’’ అని థరూర్ అన్నారు. 

యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని కేవలం కొద్ది మందే అంచనా వేసినట్టు శశి థరూర్ అన్నారు. బీజేపీ అంతటి మెజారిటీతో అధికారం సాధిస్తుందని ఎక్కువ మంది ప్రజలు అనుకోలేదన్నారు. కానీ, భారత ఓటర్లకు ఆశ్చర్యానికి గురిచేసే శక్తి ఉందన్నారు. ఏదో ఒక రోజు వారు బీజేపీని కూడా అవాక్కయ్యేలా చేస్తారని పేర్కొన్నారు.
Shashi Tharoor
CONGRESS
pm
modi

More Telugu News