Telangana: మంచిర్యాల జిల్లాలో దారుణం.. తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏ దారుణహత్య

VRA killed in MRO office in Mancherial dist Telangana
  • మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
  • రక్తపుమడుగులో పడివున్న వీఆర్ఏను గుర్తించిన స్థానికులు
  • కార్యాలయంలోనే హత్యచేసి పరారైన దుండగులు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్న దుర్గంబాబు (50) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోనే ఆయనను దారుణంగా హత్యచేసి పరారయ్యారు. 

రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Telangana
Mancherial District
VRA
MRO
Murder
Crime News

More Telugu News