Congress: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం... ప్రక్షాళన చేయాలన్న అసమ్మతి నేతలు?

  • సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
  • హాజరైన పార్టీ సీనియర్లు
  • ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు హాజరు
  • పార్టీ భవితవ్యంపై చర్చ!
CWC meet concluded

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి మరోసారి దిమ్మదిరిగిపోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పంజాబ్ లో ఘోర పరాజయం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. 

ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News