PM Modi: దేశ భద్రతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

  • భద్రతా సన్నద్ధతను సమీక్షించిన ప్రధాని
  • కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, సీతారామన్, జైశంకర్ హాజరు
  • జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులతో సమాలోచనలు
PM Modi chairs high level meeting to review security preparedness amid Ukraine crisis

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతా సన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని లోగడ కూడా ఈ విధమైన సమీక్షా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని పలు పర్యాయాలు మాట్లాడడం, శాంతికి కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించడం తెలిసిందే.

ప్రధాని నిర్వహించిన సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది.

More Telugu News