Samantha: డ్రెస్సుపై నెటిజన్ల ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన సమంత

Samantha Pens A Long Note For Critics Who Trolled Her On Dress
  • మిమ్మల్ని మీరు ఎలా బాగు చేసుకోవాలో ఆలోచించండి
  • వస్త్రధారణ ఆధారంగా జడ్జ్ చేయడం ఆపాలి
  • దాని వల్ల ఎవరికీ లాభం ఉండదని కామెంట్
సమంత... ఇప్పుడు కెరీర్ లో మంచి జోష్ మీదుంది. విడాకుల తర్వాత మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నెన్నో విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు, వస్త్రధారణపైనా కామెంట్లు చేస్తున్నారు. మొన్న క్రిటిక్స్ చాయిస్ అవార్డును అందుకున్న ఆమె.. బ్లాకిష్ గ్రీన్ కలర్ డ్రెస్సు వేసుకుని ఫంక్షన్ కు వెళ్లింది. అయితే, ఆమె డ్రెస్సింగ్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానికి సమంత ఇన్ స్టా గ్రామ్ లో కౌంటర్ ఇచ్చింది. 

అయితే, ఎదుటి మహిళలపై కామెంట్లు చేయడానికి బదులు తమ మెరుగుదల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చురకలంటించింది. ‘‘ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహాగా నాకు బాగా తెలుసు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య, సామాజిక హోదా, లుక్స్, చర్మం రంగు వంటి వాటిని ఆధారంగా చేసుకుని మహిళలను విమర్శిస్తున్నారు. చెబుతూ పోతే ఆ లిస్టు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే, వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోతోంది’’ అని పేర్కొంది. 

‘‘మనం ఇప్పుడు 2022లోకి వచ్చాం. ఇప్పటికైనా మహిళలను డ్రెస్సు కొలతల ఆధారంగా జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. వారి గురించి వారు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరికివారు తమ తమ అభివృద్ధిపై పోకస్ పెడితే జీవితంలో ఎదుగుతారు. మన ఆలోచనలను ఎదుటివారిపై రుద్దడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఓ వ్యక్తిని అర్థం చేసుకోవడంలో.. వారి మనసులు తెలుసుకోవడంలో మార్పు తీసుకొద్దాం’’ అని సమంత కౌంటర్ ఇచ్చింది.
Samantha
Tollywood
Trolls
Bollywood

More Telugu News