Somu Veerraju: జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: సోము వీర్రాజు

  • జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన‌ మ‌ర‌ణాలు
  •  కార‌ణాలేమిటో క‌నుక్కోవాల‌ని వీర్రాజు విన‌తి
  • మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్‌
somu veerraju letter to ys jagan on mystery deaths in jangareddygudem

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో గ‌డ‌చిన నాలుగు రోజుల్లోనే 18 మృత్యువాత ప‌డ్డారు. వాంతులు, విరేచ‌నాల‌కు గుర‌వుతున్న ప‌ట్ట‌ణ‌వాసులు ఆసుప‌త్రుల్లో చేరిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే చ‌నిపోతున్నారు. నాటు సారానే ఈ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్నా.. ఈ విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త అయితే రాలేదు.

 ఈ నేప‌థ్యంలో ఈ మ‌ర‌ణాల‌పై శుక్ర‌వార‌మే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నా స్పందించరా? అంటూ చంద్ర‌బాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. 

తాజాగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా ఈ మ‌ర‌ణాల‌పై స్పందించారు. ప‌శ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న‌ వరుస మరణాలపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తక్షణమే స్పందించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

మరణాలకు గల నిర్దిష్ట కారణాలను తెలియజేసి ప్రజల్లో భయబ్రాంతులను తొలగించాలని ఆయ‌న కోరారు. అంతేకాకుండా మృతులకు రూ. 5 లక్షల ఏక్స్ గ్రేసియో ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News