Ntr: ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమాకి ఎనౌన్స్ మెంట్ డేట్ ఖరారు!

  • ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాలతో
  • ఆ ప్రాజెక్టుతో పాటే బుచ్చిబాబు సినిమా 
  • పరిశీలనలో 'పెద్ది' టైటిల్ 
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ
  • ఏప్రిల్ 11న అధికారిక ప్రకటన
Ntr in Buchhi Babu movie

ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. బుచ్చిబాబు వినిపించిన కథ ఎన్టీఆర్ కీ నచ్చిందనీ .. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవమెంత అనేదే అందరిముందున్న ప్రశ్నగా మారింది. ఈ కాంబినేషన్ కష్టమే అనే టాక్ కూడా వచ్చింది. 

అయితే నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కాంబినేషన్ ను పెర్ఫెక్ట్ గా సెట్ చేశారు. అందుకు సంబంధించిన ప్రకటనను ఏప్రిల్ 11వ తేదీన చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక సమాచారంతో పాటు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.  

'ఆర్ ఆర్ ఆర్' తరువాత కొరటాలతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత బుచ్చిబాబుతో చేయవచ్చునని అనుకోవడం సహజం. కానీ కొరటాల సినిమాతో పాటే బుచ్చిబాబు సినిమాను కూడా పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

More Telugu News