Janasena: యువ‌తా మేలుకో!.. జ‌న‌సేన ఆవిర్భావ వేడుక గీతం విడుద‌ల‌

janasena formation day song released
  • ఇప్ప‌టంలో జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌
  • ఇప్ప‌టికే పూర్తి అయిన ఏర్పాట్లు
  • గీతాన్ని విడుద‌ల చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన త‌న ఆవిర్భావ వేడుక‌ల‌కు స‌దా సిద్ధ‌మైపోతోంది. ఈ నెల 14న జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామ ప‌రిధిలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావ‌చ్చాయి. ఇప్ప‌టికే ఈ వేడుక‌ల పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌..తాజాగా కాసేప‌టి క్రితం పార్టీ ఆవిర్భావ వేడుక‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన గీతాన్ని విడుద‌ల చేశారు.

యువతా మేలుకో..అంటూ సాగే ఈ గీతాన్ని అల‌రాజు అనే ర‌చ‌యిత రాయ‌గా.. హ‌రి సంగీతం సమకూర్చారు. పృథ్వీ చంద్ర పాడారు. రాష్ట్రంలో సాగుతున్న పాలనా తీరు, అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలను ప్ర‌శ్నిస్తూ సాగిన ఈ గీతంలో పార్టీ అధినేత పాల్గొన్న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోల‌ను చేర్చారు. 

  • Loading...

More Telugu News