Nagababu: ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాగబాబు... ఫొటోలు ఇవిగో!

  • ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ
  • మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం వద్ద భారీ సభ
  • అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
  • సభలో పవన్ కీలక ప్రకటనలు చేసే అవకాశం!
Nagababu visits Ippatam village

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఈ నెల 14న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పలు కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 

ఈ నేపథ్యంలో, ఇప్పటం గ్రామం వద్ద సభా ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, సినీ నటుడు నాగబాబు పరిశీలించారు. ఆయన వెంట పలువురు జనసేన నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి పలు సూచనలు చేశారు. కాగా, ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు.
.

More Telugu News