Mayawati: మీడియా మొత్తం కులపిచ్చితో ఉంది.. టీవీ డిబేట్లను బహిష్కరిస్తున్నాం: మాయావతి ఫైర్

Media is with casteist agenda says Mayawati
  • అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అవకాశాలను మీడియా దెబ్బతీసింది
  • బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది
  • ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులు మాకు దూరమయ్యారన్న మాయావతి 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. బీజేపీ మరోసారి భారీ మెజార్టీ సాధించి రెండో సారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఈ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. 

ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియో మొత్తం కులపిచ్చితో ఉందని ఆమె ఆరోపించారు. యూపీలో తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది మీడియానే అని మండిపడ్డారు. అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్న బీఎస్పీని కుల పిచ్చితో ఉన్న మీడియా దెబ్బతీసిందని అన్నారు. మీడియా సంస్థల యజమానులకు ఉన్న కుల వివక్ష, విద్వేషాలను ఎవరికీ తెలియకుండా దాయలేరని దుయ్యబట్టారు. 

బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది మీడియానే అని... ఈ దుష్ప్రచారం వల్ల ముస్లింలు, బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీఎస్పీకి దూరమయ్యారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి టీవీ డిబేట్లను తమ పార్టీ బహిష్కరిస్తోందని సంచలన ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News