Pocharam Srinivas: పాఠశాలలో విద్యార్థుల‌తో క‌లిసి లైనులో నిల‌బ‌డి ప్రార్థ‌న చేసిన స్పీక‌ర్ పోచారం

pocharma participates in prayer
  • కామారెడ్డి జిల్లా నెమలి గ్రామంలో పోచారం ప‌ర్య‌టన‌
  • ఉద‌యం విద్యార్థులు ప్రార్థ‌న చేస్తుండ‌డంతో పోచారం కూడా చేసిన వైనం
  • అనంతరం పాఠ‌శాల‌లో తొమ్మిది అదనపు తరగతి గదుల ప్రారంభం
తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఓ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో ప‌ర్య‌టించిన ఆయ‌న అక్క‌డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ఉద‌యం విద్యార్థులు ప్రార్థ‌న చేస్తుండ‌డంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వారితో క‌లిసి లైనులో నిల‌బ‌డి ప్రార్థ‌న చేశారు. 

స్పీక‌ర్ పోచారం ప్రార్థ‌న కోసం లైనులో నిల‌బ‌డ‌గా మ‌రికొంద‌రు అధికారులు కూడా అదే ప‌ని చేశారు. ప్రార్థ‌న ముగిసిన అనంతరం ఆ పాఠ‌శాల‌లో తొమ్మిది అదనపు తరగతి గదులను స్పీకర్ ప్రారంభించారు. ఈ గ‌దులను రాష్ట్ర ప్ర‌భుత్వం 60 లక్షల రూపాయ‌ల‌తో నిర్మించింది.
Pocharam Srinivas
Telangana

More Telugu News