Balakrishna: రాజమౌళి తదుపరి సినిమాలో బాలకృష్ణ కీలక పాత్ర?

Balakrishna in rajamouli Movie
  • 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో రాజమౌళి 
  • ఈ నెల 25వ తేదీన విడుదల 
  • నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో 
  • చకచకా జరుగుతున్న సన్నాహాలు 
ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ లోగా మహేశ్ బాబు .. త్రివిక్రమ్ సినిమాను కూడా పూర్తిచేస్తాడన్న మాట. 

మహేశ్ బాబు సినిమాలో కీలకమైన ఓ పవర్ఫుల్ రోల్ ఉందట. ఈ పాత్రను బాలకృష్ణ చేస్తే బాగుంటుందని భావించిన రాజమౌళి, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న స్నేహబంధం కారణంగా బాలకృష్ణ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'లో ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. 

అలా మహేశ్ బాబు సినిమాలోనూ బాలకృష్ణ కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ షోలో అటు రాజమౌళితోను .. ఇటు మహేశ్ బాబుతోను కలిసి ఎంతలా సందడి చేసిందీ తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న ఆయన, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు.
Balakrishna
Mahesh Babu
Rajamouli Movie

More Telugu News