DK Shivakumar: గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు: డీకే శివకుమార్

DK Shivkumar says no congress party without Gandhi family
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశ
  • అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యామన్న డీకే  
  • గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్ ను ఊహించలేమని వ్యాఖ్య  
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దైన్యస్థితి మరోసారి చర్చకు వస్తోంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిగ్భ్రాంతికర ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ప్రజలను మెప్పించేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో కాంగ్రెస్ ముందు ఓ అవకాశం నిలిచిందని, అందులో తమ నేతలు విఫలం అయ్యారని వెల్లడించారు. 

అయితే, గాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం నిలిచి ఉందని శివకుమార్ ఉద్ఘాటించారు. గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్ పార్టీని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ఎంతో శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. యూపీలో కార్యకర్తలు సైతం చెమటోడ్చినా ప్రయోజనం దక్కలేదని నిరాశ వెలిబుచ్చారు.
DK Shivakumar
Congress
Gandhi Family
Assembly Elections

More Telugu News