Surya: పాపం .. సూర్య హ్యాట్రిక్ హిట్ మిస్సయ్యాడే!

  • 'ఆకాశం నీ హద్దురా'తో భారీ విజయం 
  • అదే బాటలో నడిచిన 'జై భీమ్'
  • నిన్న థియేటర్లకు వచ్చిన 'ఈటి'
  • నిరాశ పరిచిన తొలిరోజు వసూళ్లు   
ET movie update

సూర్య ఈ మధ్య కాలంలో విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన సినిమాలు 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. హిట్ చిత్రాల కేటగిరిలో చేరిపోయాయి. ఆ తరువాత సినిమాగా ఆయన 'ఈటి' చేశాడు.
 
పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. 'రాధేశ్యామ్' రిలీజ్ కి ఒక రోజు ముందుగా నిన్న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని సూర్య భావించాడు. కానీ ఈ సినిమా ఆయన అంచనాలను తలక్రిందులు చేసింది. 

సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా నిన్న మంచి వసూళ్లను రాబట్టలేకపోయింది. చాలా థియేటర్స్ లో ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీ ని కూడా పొందలేకపోయిందని అంటున్నారు. ఇక తమిళనాట కూడా ఈ సినిమా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేకపోవడం విశేషం. సూర్య హ్యాట్రిక్ హిట్ మిస్సయ్యాడనే టాక్ కోలీవుడ్ లో బలంగానే వినిపిస్తోంది.

More Telugu News