ప్రొఫెసర్ గా కనిపించనున్న పవన్ కల్యాణ్!

11-03-2022 Fri 17:31
  • 'భీమ్లా నాయక్'తో పడిన హిట్ 
  • తదుపరి షెడ్యూల్ దిశగా 'వీరమల్లు'
  • త్వరలో సెట్స్ పైకి 'భవదీయుడు భగత్ సింగ్'
  • హరీశ్ శంకర్ తో పూజ హెగ్డే మూడో సినిమా
Bhavadeeyudu Bhagath Singh movie update
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'గబ్బర్ సింగ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు రూపొందనున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ అవి కార్యరూపాన్ని దాల్చలేదు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి రెడీ అవుతున్నారు. 

ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, ఫస్టు పోస్టర్ ను వదిలారు కూడా. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ  సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చనున్నాడు. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారనే ఒక టాక్ వచ్చింది. అది నిజమేననేది తాజా సమాచారం. 

ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమాతో హిట్ కొట్టిన పవన్, తాజా షెడ్యూల్ షూటింగు కోసం 'హరి హర వీరమల్లు' సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. 'భవదీయుడు భగత్ సింగ్'లో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. హరీశ్ శంకర్ తో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది.