VV Lakshminarayana: విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థులకు ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana urges AP Govt to release scholarships for students studying in abroad
  • విద్యార్థులు స్కాలర్షిప్ హామీపై విదేశాలకు వెళ్లారని వ్యాఖ్య  
  • తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించాలని వినతి
  • స్కాలర్షిప్ లు విడుదల చేయాలని విజ్ఞప్తి

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ-పాస్ నమోదు చేయించుకుని జీవో నెం.55 ప్రకారం స్కాలర్షిప్ హామీపై ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంతోమంది ఏపీ విద్యార్థులు విదేశాలకు వెళ్లారని వివరించారు. అయితే, ఆ విద్యార్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకారవేతనాలు విడుదల చేయాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తద్వారా విద్యార్థులకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News