BJP: బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

  • గవ‌ర్న‌ర్ ప్రసంగం లేకపోవ‌డంపై బీజేపీ నిర‌స‌న‌
  • వెల్‌లోకి దూసుకెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేసిన స్పీక‌ర్
  • హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • విచార‌ణను వాయిదా వేసిన హైకోర్టు
telangana high court adjourns bjp mlas suspension case

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించ‌లేదు. వారిపై స్పీక‌ర్ విధించిన స‌స్పెన్ష‌న్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాక‌రించింది. అంతేకాకుండా ఈ కేసుపై మ‌రింత విస్తృతంగా విచార‌ణ చేప‌ట్టే దిశ‌గా మ‌రోమారు అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి నోటీసుల జారీకి కూడా హైకోర్టు అనుమ‌తించ‌లేదు. ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌పై స్టే విధించేందుకు నిరాక‌రించిన కోర్టు..త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన రోజున స‌భ‌లో నిర‌స‌నకు దిగారు. స‌భ ప్రారంభం కాగానే వారు వెల్‌లోకి దూసుకెళ్లి స్పీక‌ర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసేదాకా స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News