Raghu Rama Krishna Raju: కాగ్ ను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు

MP Raghurama met CAG
  • గిరీశ్ చంద్ర ముర్ముతో భేటీ
  • అమరావతిలో కాగ్ కార్యాలయం నిర్మించాలని వినతి
  • రఘురామతో పాటు కాగ్ ను కలిసిన శివారెడ్డి, తిరుపతిరావు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీశ్ చంద్ర ముర్మును కలిశారు. అమరావతిలో కాగ్ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించాలని, నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయనను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. కాగ్ ను కలిసిన వారిలో రఘురామకృష్ణరాజుతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు శివారెడ్డి, తిరుపతిరావు కూడా ఉన్నారు. కాగ్ తో 25 నిమిషాలకు పైగా సమావేశమై, విస్తృతంగా చర్చించామని రఘురామ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.
Raghu Rama Krishna Raju
CAG
Girish Chandra Murmu
Sivareddy
Tirupatirao

More Telugu News