Gorantla Butchaiah Chowdary: ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెట్టేస్తే ఇక రాష్ట్రంలో ఏం మిగులుతుంది?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary slams AP govt on budget
  • ఏపీ బడ్జెట్ ప్రకటన
  • ప్రభుత్వానికి ముందుచూపు లేదన్న బుచ్చయ్య 
  • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంకెల గారడీ చేస్తూ గత రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెట్టేస్తే రాష్ట్రంలో ఏం మిగులుతుంది? అని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News