Revanth Reddy: రేవంత్ రెడ్డి-జగ్గారెడ్డి ఆత్మీయ కరచాలనం... 20 నిమిషాలకు పైగా భేటీ

Revanth Reddy and Jagga Reddy mutual respect at CLP office
  • ఇటీవల కాలంలో రేవంత్ పై జగ్గారెడ్డి విమర్శలు
  • సీఎల్పీ కార్యాలయంలో ఆశ్చర్యకర ఘటన
  • పరస్పరం ఎదురుపడ్డ రేవంత్, జగ్గారెడ్డి
  • మీడియా కెమెరాలకు పోజులు!

తెలంగాణ కాంగ్రెస్ లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న జగ్గారెడ్డి... నేడు రేవంత్ రెడ్డితో ఎంతో సానుకూల ధోరణితో మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయం వద్ద ఇరువురు పరస్పరం ఎదురుపడ్డారు. దాంతో జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు. 

అందుకు రేవంత్ ఆత్మీయంగా స్పందించారు. పార్టీ సీనియర్ అయిన జగ్గారెడ్డితో కరచాలనం చేశారు. దాంతో మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి 20 నిమిషాలకు పైగా సమావేశం అయ్యారు. అయితే, రేవంత్ తో ఏం చర్చించారన్న విషయం జగ్గారెడ్డి బయటికి పొక్కనివ్వలేదు. అటు, రేవంత్ సైతం సమావేశం వివరాలను పంచుకోలేదు.

  • Loading...

More Telugu News