Radhe shyam: రాధేశ్యామ్ ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద ప్ర‌భాస్ ఫ్యాన్స్ ర‌చ్చ‌.. వీడియోలు ఇవిగో

  • ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సినిమా
  • ఈరోజు విడుద‌లైన నేప‌థ్యంలో ఫ్యాన్స్ సంబ‌రాలు
  • ఓ థియేట‌ర్ వ‌ద్ద బ‌స్సు ఎక్కి డ్యాన్స్
fans burst crackers for radhe shyam

ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సినిమా ఈరోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. బాణ‌సంచా కాల్చుతూ, డ్యాన్సులు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ అంబ‌రాన్నంటే ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

థియేట‌ర్ల‌లో కాగితాలు ఎగ‌రేస్తూ రెబ‌ల్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ థియేట‌ర్ ముందు బ‌స్సుపైకి ఎక్కి డ్యాన్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాధేశ్యామ్ ఆడుతోన్న థియేట‌ర్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో నిండిపోతున్నాయి.   

More Telugu News