Andhra Pradesh: ఏపీ బడ్జెట్టులో ఆర్థిక సేవల రంగానికి రూ.69,306.74 కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.17,109.04 కోట్లు

  • రవాణా శాఖకు రూ.9,617.15 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ.4,791.69 కోట్లు
  • సంక్షేమం కోసం రూ.45,955 కోట్లు.
AP Budget Details

బడ్జెట్ లోనే అత్యధిక మొత్తాన్ని ఆర్థిక సేవల రంగానికి ఏపీ ప్రభుత్వం కేటాయించింది. రూ.69,306.74 కోట్లను కేటాయించింది. అది బడ్జెట్ లో 27.5 శాతం. నీటిపారుదల, వరద నియంత్రణ వ్యవస్థలకు రూ.11,482.37 కోట్లను కేటాయించింది. గ్రామీణాభివృద్ధి కోసం రూ.17,109.04 కోట్ల కేటాయింపులను చేసింది. 

  • ఆర్థిక శాఖకు రూ.58,583.61 కోట్లు
  • పట్టణాభివృద్ధి కోసం రూ.8,796 కోట్లు
  • పౌర సరఫరాల శాఖకు రూ.3,719.24 కోట్లు
  • జీఏడీకి రూ.998.55 కోట్లు
  • సచివాలయంకు రూ.3,396.25 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630.10 కోట్లు 
  • జనరల్ ఎకో సర్వీసెస్ కోసం రూ.4,420.07 కోట్లు 
  • రవాణా శాఖకు రూ.9,617.15 కోట్లు
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ. 11.78 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ.4,791.69 కోట్లు
  • కార్మికులు, ఉపాధి కోసం రూ.1,033.86 కోట్లు
  • సామాజిక భద్రత, సంక్షేమంకు రూ.4,331.85 కోట్లు 
  • సాంకేతిక విద్య కోసం రూ.413.5 కోట్లు
  • తాగునీళ్లు, పారిశుద్ధ్యానికి రూ.2,133.63 కోట్లు
  • సంక్షేమం కోసం రూ.45,955 కోట్లు.        
  • వైఎఎస్సార్ పెన్షన్ కానుక కోసం రూ.18 వేల కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసాకు రూ.3,900 కోట్లు 
  • రైతులకు విత్తన సరఫరా కోసం రూ.200 కోట్లు
  • జీరో బేస్డ్ వ్యవసాయానికి రూ.87.27 కోట్లు
  • వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ.1,802.04 కోట్లు
  • వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ కోసం రూ.50 కోట్లు
  • ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2 వేల కోట్లు 
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,750 కోట్లు 
  • కృషియోన్నతికి రూ.760 కోట్లు  
  • ధరల స్థిరీకరణ కోసం రూ.500 కోట్లు
  • జగనన్న విద్యా కానుకకు రూ.2,500 కోట్లు 
  • జగనన్న వసతి దీవెనకు రూ.2,083.32 కోట్లు 
  • డ్వాక్రా సంఘాల (రూరల్) వడ్డీలేని రుణాలకు రూ.600 కోట్లు
  • డ్వాక్రా సంఘాలు(పట్టణ) వడ్డీలేని రుణాలకు రూ.200 కోట్లు 
  • వడ్డీలేని రైతు రుణాలకు రూ.500 కోట్లు

More Telugu News