Radhe Shyam: 'రాధే శ్యామ్' థియేటర్ వద్ద అపశ్రుతి… ప్రభాస్ అభిమానులకు గాయాలు!

Prabhas fans wounded at cinema theatre of Radhe Shyam
  • కారంపూడిలోని థియేటర్ వద్ద ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం
  • విరిగి పక్కనున్న కరెంట్ తీగలపై పడిన ఫ్లెక్సీ
  • కరెంట్ షాక్ తో ముగ్గురు అభిమానులకు గాయాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన 'రాధే శ్యామ్' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత విడుదలైన ప్రభాస్ చిత్రం విడుదల కావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

మరోవైపు ఈ సినిమా విడులైన కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా విడుదల సందర్భంగా చల్లా కోటేశ్వరరావు (37) అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దీంతో దాన్ని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్ షాక్ కు గురై, తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Radhe Shyam
Theatre
accident

More Telugu News