Aradhana Mishra: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అరుదైన రికార్డు

  • 1980 నుంచి కాంగ్రెస్ తరపున గెలుస్తున్న ఒకే కుటుంబం
  • రాంపూర్‌ఖాస్‌ను కంచుకోటగా మార్చుకున్న ప్రమోద్ తివారీ
  • తాజా ఎన్నికల్లోనూ తివారీ కుమార్తెకే పట్టం
Congress creates sensational record in UP

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని రాంపూర్‌ఖాస్ నియోజకవర్గం నుంచి గత 42 ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ తరపున గెలుస్తూ వస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను మాత్రం ఓడించలేకపోతున్నాయి. 

ప్రమోద్ తివారీ 1980లో తొలిసారి కాంగ్రెస్ టికెట్‌పై ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 89, 91, 93, 96, 2002, 2007, 2012 ఎన్నికల్లోనూ వరుసగా ఆయన కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు.

2013లో ఆయన రాజ్యసభకు ఎంపిక కావడంతో 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె ఆరాధనా మిశ్రా ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. 2017 ఎన్నికల్లోనూ ఆమే గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా, మరోమారు విజయం సాధించి రాంపూర్‌ఖాస్ నియోజకవర్గంలో తమకు తిరుగులేదని నిరూపించారు.

More Telugu News