Russia: కేవలం బాటిల్ నీళ్లతో పెద్ద బాంబును నిర్వీర్యం చేసిన ఉక్రెయిన్ నిపుణులు.. వీడియో వైరల్

 Russia dropped bomb would flatten a building  Ukraine EODs defuse it with 2 hands and a bottle of water
  • రష్యా జారవిడిచిన బాంబు
  • చాకచక్యంగా వ్యవహరించి బాంబు నిర్వీర్యం 
  • తప్పిన పెను ప్రమాదం.. నెటిజన్ల ఫిదా

ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన అతిపెద్ద బాంబును ఉక్రెయిన్ నిపుణులు పేలకుండా చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. కేవలం ఒక లీటర్ బాటిల్ నీటితో అంత పెద్ద బాంబును పేలకుండా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఆ బాంబు పేలి ఉంటే పెను నష్టం జరిగి ఉండేది. భవనాలు క్షణాల్లో నేలమట్టం అయి ఉండేవి. 

అయితే, ఉక్రెయిన్ బాంబు స్క్వాడ్‌కు చెందిన ఇద్దరు నిపుణులు ధైర్యంగా ముందుకొచ్చి, ఎలాంటి పరికరాలు లేకుండానే చాకచక్యంగా వ్యవహరించి దానిని నిర్వీర్యం చేశారు. బాటిల్ నీళ్లు తీసుకున్న వారిలో ఒకరు దానిపై నీళ్లు పోస్తుండగా, మరొకరు దాని సీలను బయటకు తీసి బాంబు పేలకుండా చేశారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు వారి ధైర్య సాహసాలకు ఫిదా అవుతున్నారు.

  • Loading...

More Telugu News