BMW: షార్ట్ సర్క్యూట్ ముప్పు... 10 లక్షల కార్లను వెనక్కి పిలిపించాలని బీఎండబ్ల్యూ నిర్ణయం

BMW decides to recall one million above vehicles worldwide
  • క్రాంక్ కేస్ వాల్వ్ వద్ద లోపం
  • అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం
  • పొగ వస్తే డ్రైవింగ్ నిలిపివేయాలన్న బీఎండబ్ల్యూ
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ సంస్థకు చెందిన కార్లు ముందు వరుసలో ఉంటాయి. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కార్లు విలాసవంతమైన వాహనాలుగా పేరుగాంచాయి. అయితే, తాజాగా బీఎండబ్ల్యూ కార్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ముప్పు ఉందని గుర్తించారు. బీఎండబ్ల్యూ కార్లలోని పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ వాల్వ్ లోపభూయిష్టంగా ఉందని, ఇది షార్ట్ సర్క్యూట్ కు దారితీసి కారులో అగ్నిప్రమాదానికి కారణమవుతుందని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కార్లను ఈ జర్మనీ కార్ల తయారీ దిగ్గజం రీకాల్ చేస్తోంది. ఇంజిన్ వద్ద పొగ లేదా, పొగ వాసన వస్తుంటే మాత్రం తమ కార్లను వెంటనే డ్రైవింగ్ చేయడం నిలిపివేయాలని బీఎండబ్ల్యూ వాహన యజమానులకు స్పష్టం చేసింది. 

కాగా, వెనక్కి పిలిస్తున్న కార్లలో ఒక్క అమెరికాలోనే 9.17 లక్షల కార్లున్నాయట. 2006-13 మధ్యకాలంలో తయారైన కార్లను, ముఖ్యంగా 1 సిరీస్, 3 సిరీస్, ఎక్స్ 3, జడ్ 4, ఎక్స్ 5, 5 సిరీస్ కార్లను బీఎండబ్ల్యూ వెనక్కి పిలిపిస్తోంది.
BMW
Recall
Short Circuit
Cars

More Telugu News