Mahesh Babu: అల్యూమినియం ఫ్యాక్టరీలో దుమ్ము రేపేస్తున్న మహేశ్ బాబు!

  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ 
  • పాప్యులర్ అయిన కళావతి సాంగ్ 
  • మే 12వ తేదీన సినిమా రిలీజ్
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. వినోదమే ప్రధానంగా బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు .. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేశ్ బాబు మరికొందరు  ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ నడవనుంది. 

మహేశ్ బాబు మార్కు కామెడీతో పాటు యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమా ఇది. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో చిత్రీకరించిన ఫైట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు. 

ఈ సినిమాకి తమన్ బాణీలను సమకూర్చాడు. ఇప్పటికే 'కళావతి' అనే పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ - 14 రీల్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More Telugu News