TDP: ప‌థ‌కం పాతదే.. అబ‌ద్ధాలే కొత్త‌వి: వైసీపీపై టీడీపీ వ్యంగ్యం

  • విద్యా శాఖ ప‌థ‌కంపై టీడీపీ ట్వీట్‌
  • మంత్రి సురేశ్ వీడియోను జ‌త చేసిన వైనం
  • కొత్త ప‌థ‌కం అయితే పాత ప‌థ‌కం చెల్లింపులెలా? అంటూ ప్రశ్నించిన టీడీపీ  
tdp satires on ysrcp

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విప‌క్షం టీడీపీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య సెటైర్లు బాగానే పేలుతున్నాయి. అసెంబ్లీలో విద్యా శాఖ‌కు సంబంధించిన ఓ ప‌థ‌కాన్ని ప్ర‌స్తావించిన ఆ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ వీడియోను ఆధారం చేసుకుని ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ వ్యంగ్యాస్త్రం వైర‌ల్‌గా మారింది. పాత ప‌థ‌కాన్నే కొన‌సాగిస్తున్నామ‌ని చెబుతున్న సురేశ్‌.. ఆ ప‌థ‌కాన్ని జ‌గ‌న్ తీసుకొచ్చారంటూ అబ‌ద్ధం చెబుతున్నారంటూ సెటైర్ సంధించింది.

సురేశ్ చెబుతున్న‌ది వింటుంటే... "పెళ్లి కొడుకు ఆయనే... ఆయన వేసుకున్న చొక్కా మాత్రం ఆయనది కాదు" అన్నట్టుగా ఉందని టీడీపీ వ్యాఖ్యానించింది. సీఎం జ‌గ‌న్ కొత్త ప‌థ‌కం తీసుకొచ్చార‌ని చెబుతున్న సురేశ్..డ‌బ్బులు మాత్రం టీడీపీ హ‌యాంలోని పాత ప‌థ‌కం బ‌కాయిలకు క‌డుతున్నామని చెబుతున్నార‌ని ఆరోపించింది.

More Telugu News