Supreme Court: విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉంచిన సుప్రీంకోర్టు

  • వేల కోట్ల రుణం ఎగవేత కేసులో కోర్టుకు హాజరుకాని మాల్యా
  • గత నెలలో విచారణ
  • వ్యక్తిగతంగా హాజరుకాని మాల్యా
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
  • నేడు తుదివిచారణ
Supreme Court reserves verdict on Vijay Mallya contempt of the court case

బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాలకు పారిపోవడం తెలిసిందే. అయితే, రుణ ఎగవేతలపై న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో మాల్యాపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదయ్యాయి. నిన్న అమికస్ క్యూరీ పనుల ఒత్తిడిలో ఉండడంతో, ఈ కేసు నేటికి వాయిదా పడింది. నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

వ్యక్తిగతంగా హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా మాల్యా హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఉంది. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా రెండు వారాల్లో హాజరు కావాలని విజయ్ మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా, లేకపోతే న్యాయవాది అయినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచినట్టు పేర్కొంది.

More Telugu News